ఏనుగు పాలు తాగిన 3 ఏళ్ల చిన్నారి! అస్సాంలో వైరల్ అవుతున్న వీడియో, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అస్సాంలోని గోలాఘాట్‌లో ఒక చిన్నారికి, పెంచుకున్న ఏనుగుకు మధ్య ఉన్న అరుదైన ప్రేమ బంధం సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. 3 ఏళ్ల హర్షిత బోరా వారి ఇంట్లో కట్టి ఉంచిన ‘బీను’ అనే ఏనుగుతో తరచుగా ఆడుకుంటుంది. ఇటీవల వైరల్ అయిన వీడియోలో, పాలు తాగాలనే కోరికతో హర్షిత ఏనుగు పొదుగును పట్టుకొని లాగుతున్నట్లు, ఏనుగు కూడా చిన్నారికి పాలు తాగడానికి అనుమతి ఇస్తున్నట్లు కనిపిస్తుంది. తల్లి-పిల్లల మధ్య ఉండే ఈ ఆప్యాయత క్షణం చాలా మంది మనసులను గెలుచుకుంది.
అయితే, నిపుణులు ఒక విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలో మానవ-ఏనుగు సంఘర్షణలు తీవ్రమవుతున్న తరుణంలో (2021లో ఏనుగుల దాడిలో 100 మంది మరణించినట్లు రికార్డు ఉంది), ఇటువంటి సాన్నిహిత్యం చిన్నారి భద్రతకు ప్రమాదకరమని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.
हथनी का दूध पीना चाहती थी छोटी बच्ची, पकड़ लिया थन, बोली- दूध दो.. देखें फिर क्या हुआ pic.twitter.com/8y7Os5fgZW
— News Just Abhi (@newsjustabhi) August 21, 2025