యాసిడ్ తాగించిన వారికి బెయిల్ సులభం కాదు, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి: సుప్రీం కోర్ట్

యాసిడ్ తాగించిన వారికి బెయిల్ సులభం కాదు, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి: సుప్రీం కోర్ట్

బలవంతంగా యాసిడ్ తాగించిన కేసులపై సుప్రీం కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, ఇలాంటి సంఘటనలను హత్యాయత్నం (సెక్షన్ 307) కింద విచారించాలని, నిందితులకు సులభంగా బెయిల్ మంజూరు చేయకూడదని ఆదేశించింది.

“ఇటువంటి వ్యక్తులకు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అర్హత లేదు” అని కోర్టు స్పష్టం చేసింది. చట్ట పాలనకు ముప్పుగా పరిణమించే ఈ ఘోరమైన కేసుల కోసం చట్టంలో ప్రత్యేక నిబంధనలు చేర్చాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. యాసిడ్ తాగించడం వలన అంతర్గత అవయవాలు దెబ్బతిన్న బాధితులకు ‘దివ్యాంగుల’ హోదా ఎందుకు ఇవ్వడం లేదని కూడా కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *