ఢిల్లీలో 13 జిల్లాలు! పరిపాలన మెరుగుపడుతుందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటన
December 12, 2025

పరిపాలనా సౌలభ్యం, మెరుగైన పాలన కోసం దేశ రాజధాని ఢిల్లీలో జిల్లాల సంఖ్య 11 నుంచి 13కు పెరిగింది. దీనికి సంబంధించి ప్రధాన కార్యదర్శి రాజీవ్ వర్మ బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా కొద్ది రోజుల క్రితమే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థలు, జిల్లా పరిపాలన మధ్య సమన్వయం మెరుగుపరచడానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ప్రస్తుత సరిహద్దులకు అనుగుణంగా కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి.
ఈ మార్పుతో పరిపాలన మరింత సులభతరం అవుతుందని, రెవెన్యూ జిల్లాలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల సరిహద్దులు ఒకే విధంగా ఉంటాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా పేర్కొన్నారు. పాత 11 జిల్లాల జాబితా నుంచి షాదరా జిల్లాను తొలగించి, ఓల్డ్ ఢిల్లీ, సెంట్రల్ నార్త్, అవుటర్ ఢిల్లీ అనే మూడు కొత్త జిల్లాలను చేర్చారు.