విశాఖలో కెరీర్ ఫెయిర్.. 10000+ ఉద్యోగాలు

విశాఖలో కెరీర్ ఫెయిర్.. 10000+ ఉద్యోగాలు

విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయంలో మార్చి 5, 6 తేదీల్లో భారీ కెరీర్ ఫెయిర్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో కలిసి నాస్కామ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కెరీర్ ఫెయిర్‌ ద్వారా 49 ఐటీ సంబంధిత కంపెనీల్లో 10,000+ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024, 2025లో పాసైన విద్యార్థులు ఈ ఉద్యోగ మేళాకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు మార్చి 3వ తేదీలోగా తమ జీమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ కెరీర్‌ ఫెయిర్‌ ద్వారా నిరుద్యోగ యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్లను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *