శోకసంద్రంలో ఉన్న ఇంటిని వదలని దొంగలు! వాషింగ్ మెషీన్‌లో దాచిన బంగారం కూడా మాయం

శోకసంద్రంలో ఉన్న ఇంటిని వదలని దొంగలు! వాషింగ్ మెషీన్‌లో దాచిన బంగారం కూడా మాయం

పుణెలోని కాత్రాజ్ ప్రాంతంలో ఒక కుటుంబం బంధువుల అంత్యక్రియలకు వెళ్లగా, వారి ఇంట్లో చోరీ జరిగింది. దొంగల బారిన పడకుండా ఉండేందుకు కుటుంబసభ్యులు తమ బంగారు నగలను వాషింగ్ మెషీన్ లోపల భద్రంగా దాచిపెట్టారు. అయితే, వారు లాతూర్ లో ఉన్న సమయంలో ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు, ఆ రహస్య ప్రదేశంలో ఉన్న నగలను కూడా దొంగిలించారు.

నవంబర్ 26 రాత్రి 8:30 గంటల నుండి నవంబర్ 28 ఉదయం 6 గంటల మధ్య ఈ దొంగతనం జరిగింది. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు మెయిన్ డోర్ తాళం పగలగొట్టబడి ఉండటం, వాషింగ్ మెషీన్‌లో దాచిన బంగారం మాయం అవడం చూసి షాక్‌కు గురయ్యారు. పోలీసులు గుర్తు తెలియని దొంగలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *