తాలిబాన్ మద్దతుగా పుతిన్ వ్యాఖ్యలు! ‘ఆఫ్ఘన్ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది’

తాలిబాన్ మద్దతుగా పుతిన్ వ్యాఖ్యలు! ‘ఆఫ్ఘన్ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది’

భారత పర్యటన ముగించుకుని రష్యాకు తిరిగి వెళ్లే ముందు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆఫ్ఘనిస్తాన్‌కు మద్దతుగా పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని పాకిస్తాన్ పదేపదే ఆరోపిస్తున్న నేపథ్యంలో, పుతిన్ తాలిబాన్‌కు మద్దతుగా నిలిచారు. “ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది” అని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికపై ఇస్లామాబాద్‌కు ఇది ఒక పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

దశాబ్దాల అంతర్యుద్ధం తర్వాత తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులను నియంత్రణలోకి తెచ్చిందని, నల్లమందు సాగును అరికట్టడానికి కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారని పుతిన్ పేర్కొన్నారు. ఇటీవల, డ్యూరాండ్ లైన్ సరిహద్దు వివాదం కారణంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఘర్షణల మధ్య తాలిబాన్‌కు పుతిన్ మద్దతు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *