విరాట్ బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు: ‘మేము లెక్కపెడుతున్నాం, అతనికి అది రోజువారీ పని’ అన్నారు సెహ్వాగ్

విరాట్ బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు: ‘మేము లెక్కపెడుతున్నాం, అతనికి అది రోజువారీ పని’ అన్నారు సెహ్వాగ్

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీ చేసి విరాట్ కోహ్లీ మరోసారి ‘రన్ మెషిన్’ అని నిరూపించుకున్నారు. రాంచీ తర్వాత రాయ్‌పూర్‌లో 93 బంతుల్లో 102 పరుగులు చేసి అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచినప్పటికీ, కోహ్లీ స్థిరమైన ప్రదర్శన క్రికెట్ ప్రపంచంలో విస్తృత ప్రశంసలు అందుకుంది.

కింగ్ కోహ్లీ ఈ ఘనతపై మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. వీరేంద్ర సెహ్వాగ్ ‘X’ లో, “విరాట్ కోహ్లీకి 100 పిచ్చి వేరు. మేము సెంచరీలు లెక్కపెడుతున్నాము, అతను దానిని రోజువారీ పనిగా భావించి చేసేస్తున్నాడు” అని పోస్ట్ చేశారు. మహ్మద్ కైఫ్ విరాట్‌ను ‘వింటేజ్’ అని ప్రస్తావించగా, సురేష్ రైనా దీనిని భారత క్రికెట్‌కు ‘అందమైన రోజు’ అని కొనియాడారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *