పాడైన చాక్‌తో తెల్లని బూట్లు మెరిపించేవాడిని: మోదీ

పాడైన చాక్‌తో తెల్లని బూట్లు మెరిపించేవాడిని: మోదీ

అమెరికన్ పోడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్‌తో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తన చిన్నతన అనుభవాలను పంచుకున్నారు. కష్టకాలంలో పెరిగినా, ఎప్పుడూ లోటుగా అనిపించుకోలేదని, తన జీవితాన్ని మానవ సంబంధాల ప్రేమ, అప్యాయతలే నడిపించాయని అన్నారు.

మోదీ చిన్నతనంలో తన మామ అతనికి తెల్లని బూట్లు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అయితే, ఇతర పిల్లల మాదిరిగా వాటిని శుభ్రం చేసేందుకు అవసరమైన సామగ్రి తన దగ్గర లేకపోయేది. అందుకే స్కూల్లో పడేసిన చాక్‌ను ఉపయోగించి బూట్లు మెరిపించేవాడిని. జీవన పోరాటాలను ఎప్పుడూ ఆటంకంగా కాకుండా, కొత్తగా నేర్చుకునే అవకాశంగా చూసేవాడిని అని మోదీ అన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *