బీఎన్పీ చైర్పర్సన్ ఖలేదా జియా సీసీయూకి తరలింపు! విదేశీ వైద్యుల పర్యవేక్షణ
November 28, 2025

తీవ్ర అస్వస్థత కారణంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ చైర్పర్సన్ ఖలేదా జియాను ఢాకాలోని ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ (CCU)కి తరలించారు. ఆమె చికిత్సకు విదేశీ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు పర్యవేక్షిస్తున్నట్లు గురువారం ‘ప్రోథోమ్ ఆలో’ వార్తా సంస్థ వెల్లడించింది.
అయితే, ఖలేదా జియా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని బీఎన్పీ మీడియా సెల్ సభ్యుడు షైరుల్ కబీర్ ఖాన్ తెలిపారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన తదుపరి సమాచారం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.