ప్రేమ వలలో 80 ఏళ్ల వృద్ధుడు! 4 మహిళలు కలిసి రూ. 9 కోట్లు కొట్టేశారు, దేశంలోనే అతిపెద్ద మోసం

దేశంలోనే అతిపెద్ద డిజిటల్ మోసంగా భావిస్తున్న ఒక ఘటనలో, 80 ఏళ్ల వృద్ధుడిని నలుగురు మహిళలు రూ. 9 కోట్లకు పైగా మోసం చేశారు. ఏప్రిల్ 2023లో, వృద్ధుడు ఫేస్బుక్లో షార్వీ అనే మహిళతో పరిచయం ఏర్పరచుకున్నారు. ఈ పరిచయం వాట్సాప్కు దారితీసింది. తాను భర్త నుండి విడిపోయి, పిల్లలతో ఒంటరిగా ఉంటున్నానని చెప్పిన ఆ మహిళ, పిల్లల అనారోగ్యం పేరుతో పదేపదే డబ్బు అడగడం ప్రారంభించింది. వృద్ధుడు ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారు.
ఈ మోసపు వలలో షార్వీతో పాటు కవిత, దినాజ్, జాస్మిన్ అనే మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. వారు స్నేహితులుగా లేదా సోదరీమణులుగా చెప్పుకుంటూ, వివిధ సందర్భాలలో వృద్ధుడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2023 నుండి జనవరి 2025 వరకు, మొత్తం 734 లావాదేవీలలో వృద్ధుడు దాదాపు రూ. 8.7 కోట్లు కోల్పోయారు. కొడుకును రూ. 5 లక్షలు అడిగినప్పుడు ఈ మొత్తం మోసం బయటపడింది. మోసపోయిన విషయం తెలిసిన తర్వాత ఆ వృద్ధుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.