షాపులో నిలబడి ఉండగా గుండెపోటు! క్షణాల్లో కుప్పకూలిన వ్యక్తి, వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజ్

కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో 58 ఏళ్ల వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించిన విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. మాలవల్లి తాలూకాలోని హలగూరు ప్రాంతంలో ఒక షాపులో పెయింట్ కొనేందుకు వెళ్లిన హుల్లాగాల నివాసి ఇరణయ్య నిల్చుని ఉండగానే ఛాతీ పట్టుకుని కిందపడి, కొన్ని క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దృశ్యం మొత్తం షాపులోని సీసీటీవీలో రికార్డ్ అయింది.
ఇటీవల కాలంలో ఇలాంటి ఆకస్మిక గుండెపోటు కేసులు పెరుగుతుండటంపై ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గుండెపోటులకు ప్రారంభ లక్షణాలు ఉన్నప్పటికీ, ఈ కేసులో మాదిరిగా ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా అనేక సంఘటనలు జరుగుతున్నాయని కార్డియాలజిస్టులు అంటున్నారు. సకాలంలో సీపీఆర్ (CPR) అందిస్తే చాలా ప్రాణాలను కాపాడవచ్చునని నిపుణులు చెబుతున్నా, సీపీఆర్ అందించే విధానంపై సాధారణ ప్రజల్లో ఇంకా అవగాహన లోపంగానే ఉంది.
एक और अचानक मौत LIVE
— Narendra Nath Mishra (@iamnarendranath) November 22, 2025
कर्नाटक के मंड्या में दुकान में सामान ख़रीदते एक व्यक्ति की अचानक हार्ट अटैक से मौत ।
कब ऐसी मौतों को हम मेडिकल इमरजेंसी समझेंगे? क्यों नहीं हब सबके लिए यह सबसे बड़ा मुद्दा है? pic.twitter.com/29fRNB5tiw