55 డాట్ బాల్స్ అవమానం టీమ్ ఇండియాపై మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు
February 23, 2026

2026 టీ20 ప్రపంచకప్ సూపర్ 8 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్‌లో ఏకంగా 55 డాట్ బాల్స్ ఆడటంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ భారత బ్యాటర్ల వైఖరిని తప్పుబట్టారు.
భారత బ్యాటర్లు సింగిల్స్ తీయడం మర్చిపోయి కేవలం బౌండరీల కోసమే ప్రయత్నించడం వల్లే ఈ ఓటమి ఎదురైందని వాన్ విమర్శించారు. అక్షర్ పటేల్‌ను కాదని వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం పెద్ద తప్పిదమని ఆయన పేర్కొన్నారు. ఈ ఓటమి భారత జట్టుకు మేల్కొలుపు లాంటిదని, మిగిలిన జట్లలో ఇది భారత్‌ను ఓడించగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ఆయన హెచ్చరించారు.