15 ఏళ్ల తర్వాత దేశీయ క్రికెట్‌కు కోహ్లి రీ-ఎంట్రీ! ఢిల్లీ అభిమానులకు గుడ్ న్యూస్

15 ఏళ్ల తర్వాత దేశీయ క్రికెట్‌కు కోహ్లి రీ-ఎంట్రీ! ఢిల్లీ అభిమానులకు గుడ్ న్యూస్

టెస్ట్, టీ20 క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత క్రికెట్ దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆయన లిస్ట్-ఏ దేశీయ క్రికెట్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధ్యక్షుడు రోహన్ జైట్లీ ధృవీకరించారు. డిసెంబర్ 24 నుండి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టు తరఫున ఆడటానికి కింగ్ కోహ్లి అంగీకరించారు.

తన ఫామ్, ఫిట్‌నెస్‌ను కొనసాగించడానికి కోహ్లి తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీసీసీఐ సైతం స్వాగతించింది. ఈ భారత సూపర్‌స్టార్ చివరిసారిగా 2010 ఫిబ్రవరిలో విజయ్ హజారే ట్రోఫీలో ఆడారు. అంటే, సుమారు ఒకటిన్నర దశాబ్దం తర్వాత కోహ్లి తిరిగి వస్తుండటంతో ఢిల్లీతో పాటు దేశీయ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *