125 ఏళ్ల బ్రిటిష్ పాలనా గుర్తులు ఇక చరిత్రే ప్రధాని మోదీ చేతుల మీదుగా నేడు సేవా తీర్థ్ మరియు కర్తవ్య భవన్ల ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ నేడు శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం ‘సేవా తీర్థ్’ తో పాటు ‘కర్తవ్య భవన్ 1 మరియు 2’లను ప్రారంభించనున్నారు. దీనికి ముందు ఆయన సౌత్ బ్లాక్‌లోని పాత సెక్రటేరియట్ భవనంలో చివరి కేంద్ర క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సుమారు 125 ఏళ్ల బ్రిటిష్ నిర్మాణ శైలి ముద్రను చెరిపివేస్తూ, స్వతంత్ర భారత ఆధునిక పాలనా వ్యవస్థలో ఈ నూతన భవనాలు సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నాయి.
ఈ సేవా తీర్థ్ భవనంలో PMOతో పాటు జాతీయ భద్రతా మండలి మరియు క్యాబినెట్ సెక్రటేరియట్ కూడా కొలువుదీరనున్నాయి. పాత భవనాలను ‘యుగే యుగేన్ భారత్ జాతీయ మ్యూజియం’గా ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. పర్యావరణ హితంగా, 4-స్టార్ GRIHA ప్రమాణాలతో నిర్మించిన ఈ అత్యాధునిక భవనాల్లో రక్షణ, ఆర్థిక వంటి కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలు పనిచేస్తాయి. ఇది భారత పరిపాలనలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.