₹50,000 హెయిర్ డ్రయ్యర్ కొన్న కూతురు, అమ్మ రియాక్షన్ వైరల్
September 16, 2025

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇందులో ఒక కూతురు తన తల్లికి ₹50,000 విలువైన డైసన్ హెయిర్ డ్రయ్యర్‌ను చూపిస్తుంది. ఈ పరికరం ధర తెలుసుకున్న తల్లి రియాక్షన్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో మీమ్స్‌ను కూడా సృష్టించింది.
వీడియోలో, కూతురు ఉత్సాహంగా హెయిర్ డ్రయ్యర్‌ను అన్ బాక్సింగ్ చేస్తోంది, అప్పుడు ఆమె తల్లి దాని ధర అడుగుతుంది. కూతురు ₹50,000 అని చెప్పగానే, తల్లి వెంటనే “తల మీద జుట్టు లేదు, దాన్ని ఆరబెట్టడానికి ఇంత ఖరీదైన డ్రయ్యర్ తీసుకున్నావా” అని చురక అంటిస్తుంది. ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వేలల్లో లైక్‌లు, కామెంట్లు అందుకుంది.