హెల్మెట్ లేని వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల అదిరిపోయే బంపర్ ఆఫర్

హెల్మెట్ లేని వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల అదిరిపోయే బంపర్ ఆఫర్

రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘హెల్మెట్ బ్యాంక్’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్ వద్ద ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానంలో, హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారికి జరిమానాతో పాటు తక్షణ రక్షణ కోసం హెల్మెట్ అందజేస్తారు. వాహనదారుల్లో చైతన్యం నింపడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

ఈ సదుపాయం పొందిన వారు తమ వివరాలను పోలీసులకు సమర్పించి, 24 గంటల్లోగా సొంతంగా కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి పాతది తిరిగి ఇచ్చేయాలి. గడువులోగా స్పందించని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారు. మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పరిధిలో మొదలైన ఈ కాన్సెప్ట్ విజయవంతమైతే నగరం మొత్తం విస్తరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *