స్ట్రా ద్వారా బుడగలు ఊదుతూ చేపను పట్టిన తెలివైన పిల్లి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్
February 14, 2026

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక పిల్లి నోటితో స్ట్రాను పట్టుకుని నీటిలో బుడగలు పుట్టిస్తోంది. ఆ బుడగలను చూసి చేప దగ్గరకు రాగానే పిల్లి అత్యంత వేగంతో దానిని వేటాడింది. పిల్లి ప్రదర్శించిన ఈ వినూత్నమైన వేట సామార్థ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో దీని సాధికారతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఖచ్చితంగా కృత్రిమ మేధస్సు లేదా ఏఐ సృష్టించిన మాయాజాలమని నెటిజన్లు భావిస్తున్నారు. జంతువుల సహజ ప్రవర్తనకు భిన్నంగా పిల్లి ఇలా పరికరాలను వాడటం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.