సౌత్ హీరోయిన్‌ల అసలైన వయసు తెలుసా?
March 14, 2025

సౌత్ సినిమా హీరోయిన్ల వయసు, వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐదు ప్రముఖ హీరోయిన్ల వయసు బయటకొచ్చింది.
‘బాహుబలి’ ఫేమ్ అనుష్క శెట్టి 1981 నవంబర్ 7న జన్మించారు, ప్రస్తుతం ఆమె 43 ఏళ్ల వయస్సులో ఉన్నారు. సమంతా రూత్ ప్రభు 1987 ఏప్రిల్ 28న జన్మించగా, ప్రస్తుతం ఆమె వయస్సు 37. రష్మిక మందన్న 1996 నవంబర్ 5న జన్మించగా, 28 ఏళ్ల వయస్సులో ఉన్నారు. తమన్నా భాటియా 35 ఏళ్ల వయస్సులో ఉన్నారు. ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ ప్రస్తుతం 32 ఏళ్ల వయస్సులో ఉన్నారు.
వయస్సు పెరిగినా, ఈ హీరోయిన్లు ఫిట్‌నెస్, గ్లామర్, అద్భుతమైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు!