సతీమణికి ఎన్టీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు
March 26, 2025

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోషల్ మీడియా వేదికగా భార్యతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. “అమ్మలూ.. హ్యాపీ బర్త్‌డే” అంటూ ప్రేమతో కూడిన మెసేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ‘దేవర’ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్‌లో ఉన్న ఈ జంట ప్రత్యేకంగా ఈ ప్రత్యేకమైన రోజును అక్కడే జరుపుకుంటున్నట్లు సమాచారం. 2011లో ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం చేసుకోగా, వీరికి అభయ్ రామ్, భార్గవ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు కూడా ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.