వ్యాపారవేత్త హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

వ్యాపారవేత్త హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌ను హత్య కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది వ్యాపారవేత్త విక్లూ శివ హత్యకు గురైన ఘటనలో బసవరాజ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో అరెస్ట్ అనివార్యమైంది.

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐడీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే జరిగిన ఈ అరెస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *