వైరల్ వీడియో క్రేజ్ ప్రాణం తీసింది విషపూరిత పీతను తిని మహిళా కంటెంట్ క్రియేటర్ మృతి
February 14, 2026

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆరాటంతో ఫిలిప్పీన్స్‌కు చెందిన 51 ఏళ్ల ఎమ్మ అమిత్ విషపూరితమైన పీతను తిని ప్రాణాలు కోల్పోయారు. తన ఇంటి సమీపంలోని మడ అడవుల నుంచి ‘డెవిల్ క్రాబ్’ అని పిలిచే పీతను సేకరించి, దానిని వండుకుని తింటూ వీడియో చిత్రీకరించారు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఆ ఆహారం తిన్న 24 గంటల్లోనే ఎమ్మ పెదవులు నీలం రంగులోకి మారి పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే హృదయ స్పందన ఆగిపోయి ఫిబ్రవరి 6న ఆమె మరణించారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో స్థానికంగా ఉండే ప్రమాదకరమైన సముద్రపు జీవులను ఆహారంగా తీసుకోవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.