వెనిజులా చమురు నిల్వలపై ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం కీలక సంస్కరణల చట్టంపై సంతకం

వెనిజులా చమురు రంగంపై దశాబ్దాల కాలంగా ఉన్న ప్రభుత్వ నియంత్రణకు తెరపడింది. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ చమురు రంగ సంస్కరణలకు సంబంధించిన కొత్త చట్టంపై గురువారం సంతకం చేశారు. దీనివల్ల చమురు ఉత్పత్తి, శుద్ధి మరియు విక్రయాలపై ప్రైవేట్ సంస్థలకు పూర్తి నియంత్రణ లభిస్తుంది. దేశ భవిష్యత్తు కోసం మరియు రాబోయే తరాలకు కొత్త వెనిజులాను అందించడానికే ఈ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్రిగ్జ్ పేర్కొన్నారు.
నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత చోటుచేసుకున్న ఈ పరిణామం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ చట్టంపై సంతకం చేయడానికి ముందు రోడ్రిగ్జ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో చర్చలు జరిపారు. డ్రగ్ టెర్రరిజం ముసుగులో అమెరికా అసలు లక్ష్యం వెనిజులా చమురు నిల్వలను దక్కించుకోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.