విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం
March 22, 2025

విశాఖ మేయర్ వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలుగా కూటమి నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో YCPకి షాక్ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. GVMCలో 98 స్థానాలుండగా, YCP 59 చోట్ల గెలిచింది. ఈ 9 నెలల్లో 28 మంది కూటమి పార్టీల్లో చేరడంతో YCP బలం పడిపోయింది. మేయర్‌కు నాలుగేళ్ల పదవీకాలం పూర్తవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానానికి మార్గం సుగమమైంది.