విడాకుల ముందు భర్తతో బిడ్డను కోరిన భార్య కోర్టులో సంచలన తీర్పు
January 2, 2026

మహారాష్ట్రలోని నాందేడ్ ఫ్యామిలీ కోర్టులో ఒక వింత విడాకుల కేసు వెలుగుచూసింది. వృత్తిరీత్యా వైద్యులైన దంపతులు విడిపోవాలని నిర్ణయించుకోగా, భార్య మాత్రం విడాకులకు ముందు భర్త ద్వారా రెండోసారి గర్భం దాల్చాలని కోర్టును కోరింది. తన మొదటి బిడ్డకు తోడుగా మరొకరు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ అసాధారణ విన్నపాన్ని ఆమె న్యాయమూర్తి ముందు ఉంచారు.
మహిళ కోరికను మన్నించిన కోర్టు, ఐవీఎఫ్ (IVF) పద్ధతి ద్వారా గర్భం దాల్చేందుకు అనుమతినిచ్చింది. ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చును మహిళే స్వయంగా భరిస్తారని, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ బాధ్యతలను కూడా ఆమె చూసుకుంటారని కోర్టు పేర్కొంది. విడాకుల ప్రక్రియలో ఉండి కూడా ఒక తల్లి తన బిడ్డ కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.