వరల్డ్ కప్ మధ్యలో భారత్‌కు షాక్, అభిషేక్ శర్మ దూరం కానున్నారా

టి-20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన, మొదటి మ్యాచ్‌లో కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో ఫీల్డింగ్ చేయలేకపోయారు. తాజాగా కోచ్ గౌతమ్ గంభీర్ ఏర్పాటు చేసిన విందుతో పాటు మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా అభిషేక్ హాజరుకాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ ఈ విషయంలో స్పందిస్తూ, ఫిబ్రవరి 12న జరిగే మ్యాచ్ సమయానికి అభిషేక్ కోలుకుంటాడని టీమ్ ఇండియా ఆశాభావంతో ఉందని తెలిపారు. ఒకవేళ ఆయన కోలుకోకపోతే, ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను బరిలోకి దించే ఆలోచనలో యాజమాన్యం ఉంది. ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న అభిషేక్, కీలక సమయంలో జట్టుకు అందుబాటులో ఉంటారో లేదో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.