లోక్‌సభకు రాని మోదీ! స్పీకర్ వ్యాఖ్యలపై మహువా మోయిత్రా సంచలన విమర్శలు

లోక్‌సభకు రాని మోదీ! స్పీకర్ వ్యాఖ్యలపై మహువా మోయిత్రా సంచలన విమర్శలు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ లోక్‌సభకు గైర్హాజరు కావడంతో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో సభ సోమవారం వరకు వాయిదా పడింది. విపక్షాల నిరసనల నేపథ్యంలో సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తానే ప్రధానిని రావొద్దని కోరినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ఈ వివరణపై స్పందించిన టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, “మహిళా ఎంపీలు ఏమైనా ప్రధానిని కరుస్తారా?” అంటూ ఎద్దేవా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *