రెండోసారి డోపీగా తేలిన శివ్పాల్ సింగ్
May 21, 2025

జావెలిన్ త్రోయర్ శివ్పాల్ సింగ్ రెండోసారి డోప్ పరీక్షలో విఫలమయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో డోప్ పరీక్ష కోసం మూత్ర నమూనాలు సేకరించారు. తాజాగా ఆ పరీక్షలో అతను నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. కాగా 2021లో జరిపిన డోపింగ్ పరీక్షలో విఫలమైన శివ్పాల్ ఏడాది పాటు సస్పెన్షన్ ఎదుర్కొన్నాడు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిబంధనల ప్రకారం రెండోసారి డోపీగా తేలితే గరిష్ఠంగా 8ఏళ్ల వరకూ శిక్ష పడుతుంది.