రెండు అడుగులు వేయగానే ఆగిన పెళ్లి: ఒకే గోత్రం కావడంతో నిలిచిపోయిన వివాహం!
September 20, 2025

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లాలో ఈసగర్ లోని ఒడిలా గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. రెండు అడుగులు వేయగానే పెళ్లిని ఆపేశారు. వధూవరుల ఇద్దరి గోత్రాలు ఒక్కటే అని కనుగొనడంతో వివాహం రద్దైంది. ఈ విషయాన్ని వధువు కుటుంబం వెల్లడించింది. అయితే, వరుడు కుటుంబం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. జీప్, బస్ కి బదులుగా ట్రక్కు, ట్రాక్టర్ లో పెళ్లి ఊరేగింపు రావడమే దీనికి కారణమని వారు ఆరోపించారు.
ఈ ఘటనపై ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఒకే గోత్రం కారణంగా వివాహం రద్దైందని వధువు కుటుంబం చెబుతుండగా, కారుకి బదులుగా ట్రక్కు, ట్రాక్టర్ లో వచ్చారని వరుడి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.