రాహుల్ గాంధీ ఎంపీ పదవికి ముప్పు పొంచి ఉందా
February 13, 2026

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పార్లమెంటులో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. దేశ భద్రత మరియు ఆర్థిక వ్యవస్థపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు విదేశీ శక్తుల ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని బీజేపీ పట్టుబడుతోంది.
కాంగ్రెస్ ఈ చర్యను రాజకీయ కక్షసాధింపుగా కొట్టిపారేసింది. మంత్రి పదవి కోసమే నిషికాంత్ దూబే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. ఈ పరిణామాలతో పార్లమెంటులో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.