రాత్రి నిద్ర రావడం లేదా? ఈ సూపర్ ఫుడ్స్‌తో నిమిషాల్లో గాఢ నిద్ర మీ సొంతం

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నిద్రలేమి. మానసిక ఒత్తిడి, మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం మరియు శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం అలవాట్లే కాకుండా మనం తీసుకునే ఆహారం కూడా మన నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా సహజంగానే గాఢ నిద్రను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా మెగ్నీషియం పుష్కలంగా ఉండే బాదం పప్పు నిద్రలేమికి అద్భుత పరిష్కారం. సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతత పొందుతుంది. అలాగే అరటిపండులో ఉండే పోషకాలు శరీరానికి తగిన విశ్రాంతిని అందిస్తాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా జాజికాయ పొడి కలిపి తాగితే సహజంగానే హాయిగా నిద్ర పడుతుంది.
మరోవైపు, చెర్రీ పండ్లు శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా నిద్రకు అవసరమైన ‘మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. సాయంత్రం వేళ తాజా చెర్రీలను తీసుకోవడం వల్ల రాత్రిపూట గాఢ నిద్ర పడుతుంది. ఆహార మార్పులతో పాటు ప్రతిరోజూ నిర్ణీత సమయానికి పడుకోవడం, ఉదయాన్నే మేల్కొనడం వంటి క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు సరైన పోషకాహారం ద్వారా నిద్రలేమి సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.