రాజీవ్ యువ వికాసం కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఇవే!
March 26, 2025

‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాలి. రేషన్ కార్డు తప్పనిసరి, లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించాలి. అలాగే, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటోను కూడా సమర్పించాలి.
ఈ పథకానికి వివిధ విభాగాల ప్రకారం అదనపు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కోసం దరఖాస్తు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వ్యవసాయ యూనిట్ కోసం దరఖాస్తు చేసేవారు పట్టాదారు పాస్బుక్ సమర్పించాలి. దివ్యాంగ అభ్యర్థులు తమ వైకల్యాన్ని నిరూపించే సర్టిఫికెట్ను జత చేయాలి. దరఖాస్తును పూర్తిగా భర్తీ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసి సంబంధిత MPDO లేదా మున్సిపల్/జోనల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలి.