రాజాసింగ్ సంచలన ఆరోపణలు – సొంత పార్టీ నేతలకే తానేనా లక్ష్యం?
March 26, 2025

BJP MLA రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై PD యాక్ట్ పెట్టినప్పుడు BRS హయాంలో కొందరు BJP నేతలే పోలీసులకు తనను జైలుకు పంపాలని చెప్పారని ఆరోపించారు. ఇప్పుడు కూడా తమకున్న శత్రువులు బయటకంటే పార్టీ నుంచే ఎక్కువగా ఉన్నారని, వెన్నుపోటు పొడవాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు.
అదే సమయంలో KTR చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ మండిపడ్డారు. అధికారంలోకి వస్తే పోలీసులపై చర్యలు ఉంటాయని KTR హెచ్చరించడాన్ని తప్పుబట్టారు. గతంలో KTR ఆదేశాలతోనే రేవంత్ రెడ్డిని ఆయన బెడ్రూమ్‌లోకి వెళ్లి అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు సీఎం అయిన రేవంత్ ఆ పోలీసులకు ఏమి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపాయి.