రాజాసింగ్ సంచలన ఆరోపణలు – BJP నేతలపై అసంతృప్తి
March 26, 2025

BJP MLA రాజాసింగ్ మరోసారి తనే పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. BRS ప్రభుత్వం హయాంలో తనపై PD యాక్ట్ విధించినప్పుడు, కొందరు BJP నేతలే తనను జైలుకు పంపాలని పోలీసులకు సూచించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కూడా తనపై కుట్రలు జరుగుతున్నాయని, వెన్నుపోటు పొడవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని వాపోయారు.
ఇక, అధికారంలోకి వస్తే పోలీసులపై చర్యలు ఉంటాయన్న KTR వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. గతంలో KTR ఆదేశాలతోనే రేవంత్‌రెడ్డి బెడ్రూమ్‌లో అరెస్ట్ అయ్యారని, కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా ఏమీ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తన పార్టీకి చెందిన కొందరు నేతలు తనను అడ్డుకోవాలని చూస్తున్నారన్న ఆయన వ్యాఖ్యలు కొత్త వివాదాలకు దారితీసే అవకాశముంది.