రాజకీయాలను వదిలేస్తా: డీకే స్పష్టీకరణ

రాజకీయాలను వదిలేస్తా: డీకే స్పష్టీకరణ

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని తాను చెప్పలేదని స్పష్టం చేశారు. తాను అలా అన్నట్లు ఎవరు నిరూపిస్తే, రాజకీయాలను వదిలేస్తానని సవాల్ విసిరారు. తన వ్యాఖ్యలను బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న డీకే, ముస్లింలకు రిజర్వేషన్ కోటా కోసం రాజ్యాంగాన్ని సవరించే “మంచి రోజు” రావొచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తుండగా, ఆయన స్పష్టతనిచ్చారు. బీజేపీ అనవసరంగా రాజకీయం చేస్తుందని ఆయన ఆరోపించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *