రష్యా-ఉక్రెయిన్ మధ్య తాత్కాలిక ఒప్పందం!

రష్యా-ఉక్రెయిన్ మధ్య తాత్కాలిక ఒప్పందం!

రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇంధన ఉత్పత్తి ప్రాంతాలైన చమురు కర్మాగారాలు, రిఫైనరీలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు జరపకూడదని రెండు దేశాలు అంగీకరించాయి. రష్యా ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ ఒప్పందం తాత్కాలికంగా 30 రోజులు అమలులో ఉండనుంది. పరస్పర అంగీకారంతో దీన్ని మరింత కాలం పొడిగించేందుకు అవకాశం ఉందని రష్యా పేర్కొంది. అయితే, ఈ ఒప్పందాన్ని ఎవరు ఉల్లంఘించినా అది తక్షణమే రద్దవుతుందని స్పష్టం చేసింది. ఈ ఒప్పందం అమలు వల్ల ఇరుదేశాల ఇంధన వనరులకు భద్రత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *