యోగి ఇలాకాలో దారుణం! అల్ట్రాసౌండ్ సాకుతో మహిళను బట్టలు విప్పమని బలవంతం చేసిన డాక్టర్
December 13, 2025

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం గోరఖ్‌పూర్‌లోని జిల్లా మహిళా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన మహిళపై లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. అల్ట్రాసౌండ్ పరీక్ష చేయాలనే పేరుతో డాక్టర్ తనను పూర్తిగా దుస్తులు విప్పమని బలవంతం చేశాడని బాధితురాలు ఆరోపించారు. ఆమె అభ్యంతరం చెప్పినప్పటికీ, ఆ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించి, అశ్లీల చేష్టలకు పాల్పడ్డాడు, ప్రతిఘటించినప్పుడు బెదిరించి, దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సంఘటన బయటకు రావడంతో ఆసుపత్రి యాజమాన్యం కలకలం చెందింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అభిమన్యు గుప్తాపై లైంగిక వేధింపులు, దాడి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై ఆసుపత్రి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది, విచారణలో దోషి తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.