యూరోప్ వెళ్లే ప్రసక్తే లేదు సౌదీ అరేబియాలోనే ఉంటానన్న క్రిస్టియానో రొనాల్డో
February 23, 2026

అల్ నాసర్ క్లబ్‌ను క్రిస్టియానో రొనాల్డో వీడుతున్నారనే వార్తలకు చెక్ పడింది. అల్ హజమ్ జట్టుపై ఘనవిజయం తర్వాత రొనాల్డో మాట్లాడుతూ, సౌదీ అరేబియాలో తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టంతా క్లబ్‌ను లీగ్ ఛాంపియన్‌గా నిలబెట్టడంపైనే ఉందని ఆయన ప్రకటించారు.
యూరోప్ లేదా అమెరికా లీగ్‌లకు తిరిగి వెళ్తారనే ప్రచారాన్ని రొనాల్డో కొట్టిపారేశారు. 2027 వరకు ఒప్పందం ఉన్న నేపథ్యంలో, సౌదీ ప్రో లీగ్‌లోనే కొనసాగుతానని తెలిపారు. ప్రస్తుతం రొనాల్డో నేతృత్వంలోని అల్ నాసర్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ టైటిల్ రేసులో దూసుకుపోతోంది.