మోదీ మరియు ట్రంప్ స్నేహం పాకిస్థాన్‌కు శాపం, భారత దేశంలో పెరగనున్న ఉపాధి అవకాశాలు
February 4, 2026

న్యూస్ డెస్క్ : భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన కొత్త వాణిజ్య ఒప్పందాలు సామాన్య భారతీయుల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయి. ట్రంప్ భారతీయ వస్తువులపై పన్నులు తగ్గించడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. అయితే, ఈ పరిణామం పాకిస్థాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. తమ దేశ నాయకత్వం వైఫల్యం వల్ల తాము వెనుకబడిపోతున్నామని అక్కడి సామాన్యులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ ఎక్కడా తలవంచకుండా అమెరికా నుండి భారీ ప్రయోజనాలను సాధించారని పాకిస్థానీయులు కొనియాడుతున్నారు. మరోవైపు తమ దేశ సైనిక నాయకత్వం కేవలం మాటలకే పరిమితమైందని వారు విమర్శిస్తున్నారు. భారత్ సాధించిన ఈ దౌత్య విజయం సామాన్య భారతీయులకు గర్వకారణంగా మారగా, పాకిస్థాన్‌లోని సామాన్యులకు అది ఒక తీరని నిరాశను మిగిల్చింది.