మోదీ తన వ్యక్తిగత ఇమేజ్ కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

మోదీ తన వ్యక్తిగత ఇమేజ్ కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

భోపాల్‌లో జరిగిన మహా కిసాన్ సమ్మేళనంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికే అమెరికా ఒత్తిడికి తలొగ్గి దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా వాణిజ్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందం వల్ల రాబోయే ఐదేళ్లలో భారత్ దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

దీనివల్ల దేశీయ వ్యవసాయం మరియు టెక్స్‌టైల్ రంగాలు పూర్తిగా కుప్పకూలుతాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన కీలక ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెబుతూ, వెంటనే దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *