మెస్సీని చూసేందుకు అర్ధరాత్రి కోల్‌కతాలో అభిమానుల పరుగు; అర్జుంటీనా స్టార్ కోసం ‘క్రేజీ’ ఫ్యాన్స్

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘GOAT ఇండియా టూర్ 2025’ కోసం కోల్‌కతాకు చేరుకోగానే, నగరంలో ‘మెస్సీ మేనియా’ మొదలైంది. శుక్రవారం అర్థరాత్రి తర్వాత మెస్సీ విమానం దిగింది. తీవ్రమైన చలిని సైతం లెక్క చేయకుండా వేలాది మంది అభిమానులు ఎయిర్‌పోర్టు వెలుపల వేచి ఉన్నారు. అభిమానులు రాత్రంతా ‘మెస్సీ… మెస్సీ’ నినాదాలు, డ్రమ్స్ శబ్దాలతో ప్రాంతాన్ని ఉర్రూతలూగించారు.
శనివారం తెల్లవారుజామున, కట్టుదిట్టమైన భద్రత మధ్య మెస్సీని VIP గేట్ ద్వారా బయటకు తీసి, వెంటనే హోటల్‌కు తరలించారు. ఈ పర్యటనలో ఆయన కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు వెళ్తారు. భారతదేశంలోని ఫుట్‌బాల్ అభిమానులకు ఇది ఒక చారిత్రక ఘట్టం.
VIDEO | West Bengal: Argentine footballer Lionel Messi arrived at Kolkata Airport accompanied by Luis Suarez and Rodrigo De Paul.
— Press Trust of India (@PTI_News) December 12, 2025
(Source: Third Party)#LionelMessi
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/nNVfGvfpnX