మెట్రో ఛార్జీల పెంపు: సీఎం వాదనను తిప్పికొడుతూ ఆధారాలు బయటపెట్టిన ఎంపీ తేజస్వి సూర్య!

మెట్రో ఛార్జీల పెంపు: సీఎం వాదనను తిప్పికొడుతూ ఆధారాలు బయటపెట్టిన ఎంపీ తేజస్వి సూర్య!

మెట్రో ఛార్జీల పెంపుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఎంపీ తేజస్వి సూర్య మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఛార్జీల పెంపు కేంద్రానిదేనన్న సీఎం వ్యాఖ్యలను తేజస్వి సూర్య ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ పెంపునకు సిఫార్సు చేసిందని నిరూపిస్తూ సంబంధిత అధికారిక పత్రాలను ఆయన సోషల్ మీడియాలో బహిర్గతం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే మెట్రో ధరలు పెంచాలని నగరాభివృద్ధి శాఖ లేఖలు రాసిందని సూర్య మండిపడ్డారు. సామాన్యులపై భారం మోపే ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఫిబ్రవరి 9 నుండి అమలయ్యే కొత్త ధరలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *