ముంబైలో నూతన సంవత్సర విషాదం ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు

ముంబైలో నూతన సంవత్సర విషాదం ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు

ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకల వేళ ఒక ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ, 25 ఏళ్ల మహిళ తన 44 ఏళ్ల ప్రియుడిపై కత్తితో దాడి చేసి అతని జననేంద్రియాలను కోసేసింది. గత ఏడేళ్లుగా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. బాధిత వ్యక్తి ఆమె నుండి తప్పించుకోవడానికి బీహార్ వెళ్ళినప్పటికీ, ఫోన్ ద్వారా బెదిరింపులు ఎదుర్కొన్నట్లు సమాచారం.

డిసెంబర్ 31 రాత్రి కొత్త సంవత్సరం సందర్భంగా స్వీట్లు ఇస్తానని నమ్మించి ఆ వ్యక్తిని ఆమె ఇంటికి పిలిపించింది. అతను ఇంటికి వెళ్లగానే వంటగదిలోని కత్తితో ఒక్కసారిగా దాడికి పాల్పడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *