మిస్సవ్వద్దు! మిమ్మల్ని స్నానం చేయించే ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ వచ్చేసింది, ధర ఎంతంటే?
November 29, 2025

ఉరుకులు పరుగుల జీవితంలో వాషింగ్ మెషీన్ ఒక నిత్యావసర వస్తువుగా మారింది. ఇప్పుడు జపాన్ ఈ సాంకేతికతను మరో మెట్టు ఎక్కించింది. అక్కడి ఒక సంస్థ ‘మిరాయి నింజెన్ సెంట్సకుకి’ (Mirai Ninjen Sentakuki) లేదా ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ అనే వినూత్న పరికరాన్ని తీసుకొచ్చింది. పూర్తిగా కృత్రిమ మేధస్సు (AI) ద్వారా పనిచేసే ఈ పరికరం ఇప్పుడు బహిరంగ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది.
ఈ యంత్రం బట్టలనే కాదు, వినియోగదారులను కూడా చక్కగా స్నానం చేయిస్తుంది. దీనిలోకి వెళ్లగానే, AI చర్మ రకాన్ని బట్టి సబ్బు, మసాజ్‌ను ఆటోమేటిక్‌గా ఎంపిక చేస్తుంది. గోరువెచ్చని నీటిలో షాంపూ మరియు బుడగలతో స్నానం పూర్తయ్యాక, చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను కూడా అందిస్తుంది. ఒసాకా హోటల్ మొదటి యూనిట్‌ను కొనుగోలు చేస్తోంది. అయితే, ఈ యంత్రం ధర సుమారు $3.2 కోట్లుగా అంచనా.