మమతా బడ్జెట్‌పై అభిషేక్ ప్రశంసలు! 2026 ఎన్నికల ముందు బెంగాల్ సర్కార్ మాస్టర్ స్ట్రోక్
February 7, 2026

2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అభిషేక్ బెనర్జీ ‘పీపుల్-ఫస్ట్’ బడ్జెట్‌గా అభివర్ణించారు. ఈ బడ్జెట్ అద్భుతమైన దూరదృష్టితో కూడుకున్నదని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఇది దిక్సూచి అని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ వివక్షను ఎండగడుతూ, ఈ బడ్జెట్ బెంగాల్ ప్రజల పట్ల ఉన్న సానుభూతికి మరియు అంకితభావానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా ‘యువసాతి’ పథకం ద్వారా యువతకు ఆర్థిక భరోసా, ‘లక్ష్మీర్ భండార్’ నిధుల పెంపును ఆయన చారిత్రాత్మక నిర్ణయాలుగా అభివర్ణించారు. భూమిలేని రైతులకు ఆర్థిక సాయం, సాగునీటి పన్ను మినహాయింపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ రంగాల ఉద్యోగుల గౌరవ వేతనం పెంపు వారి సేవలకు దక్కిన గుర్తింపు అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.