భార్య నుంచి ఫోన్ అంటే టెన్షన్! – అభిషేక్ బచ్చన్

‘ఐ వాంట్ టు టాక్’ అనే సినిమాకు ‘ఉత్తమ నటుడు’ అవార్డు అందుకున్న సందర్భంగా ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన హోస్ట్ అర్జున్ కపూర్, “ఎవరైనా ‘ఐ వాంట్ టు టాక్’ అంటూ కాల్ చేస్తే మీరు టెన్షన్ పడతారా?” అని ప్రశ్నించగా, అభిషేక్ వెంటనే తన భార్య ఐశ్వర్య రాయ్ పేరు చెప్పారు. “ఆమె నుంచి అలాంటి ఫోన్ కాల్ వస్తే, కచ్చితంగా ఏదో సమస్యలో ఉన్నట్టు,” అని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు.
ఇటీవల ఐశ్వర్య, అభిషేక్ విడాకులపై పుకార్లు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇద్దరూ బహిరంగంగా ఈ విషయంపై స్పందించకపోయినా, కొంతకాలంగా ఒకరినొకరుAvoid చేస్తోన్నట్లు ప్రచారం ఉంది. అయితే అభిషేక్ తాజా వ్యాఖ్యలు ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చినట్టయింది. నిజంగా వారి వైవాహిక జీవితం సమస్యల్లో ఉందా? లేక ఇది కేవలం హాస్యసభలో వచ్చిన సరదా కామెంటా? అన్నది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.