భార్య గర్భం దాల్చగానే భర్త రెండో పెళ్లి చేసుకునే వింత ఆచారం, రాజస్థాన్‌లోని ఈ గ్రామంలో ఉన్న అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు

భార్య గర్భం దాల్చగానే భర్త రెండో పెళ్లి చేసుకునే వింత ఆచారం, రాజస్థాన్‌లోని ఈ గ్రామంలో ఉన్న అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా దేరాసర్ గ్రామంలో దశాబ్దాలుగా ఒక వింత మరియు ఆందోళనకరమైన ఆచారం కొనసాగుతోంది. ఇక్కడ భార్య గర్భవతి కాగానే భర్త రెండో పెళ్లి చేసుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. అయితే దీని వెనుక ఉన్న కారణం శారీరక కోరికలు కాదు, కేవలం ఒక బిందె నీరు మాత్రమే. ఎడారి ప్రాంతం కావడంతో ఇక్కడ నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంటుంది. మహిళలు నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి ఉంటుంది. గర్భవతిగా ఉన్న సమయంలో మహిళలు అంత దూరం వెళ్లి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి, ఇంటి అవసరాల కోసం నీటిని తెచ్చేందుకు భర్తలు రెండో పెళ్లి చేసుకుంటారు.

ఈ దుస్థితి కేవలం రాజస్థాన్‌కే పరిమితం కాలేదు, మహారాష్ట్రలోని సుమారు 19 వేల గ్రామాల్లో కూడా ఈ పద్ధతి కనిపిస్తుంది. అక్కడ రెండో భార్యలను ‘వాటర్ వైవ్స్’ లేదా ‘నీటి భార్యలు’ అని పిలుస్తారు. కొన్ని గ్రామాల్లో పురుషులు ఏకంగా ముగ్గురు భార్యలను చేసుకుంటారు; ఒకరు పిల్లలను చూసుకుంటే, మిగిలిన ఇద్దరు నీటిని మోసుకురావడానికి కేటాయించబడతారు. నీటి కోసం వీరు రోజుకు 10 నుండి 12 గంటల సమయం వెచ్చించాల్సి వస్తుంది. సామాజిక పరిస్థితులు మరియు నీటి కష్టాల దృష్ట్యా మొదటి భార్యలే స్వయంగా ఈ రెండో పెళ్లికి అంగీకారం తెలపడం గమనార్హం, దీనివల్ల అధికారులు కూడా ఈ సంప్రదాయాన్ని అడ్డుకోలేకపోతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *