భారత్ పాక్ మ్యాచ్‌కు ముందే పిచ్‌పై పాకిస్థాన్ కొత్త డ్రామా, ఐసీసీ లక్ష్యంగా సక్లయిన్ విమర్శలు

భారత్ పాక్ మ్యాచ్‌కు ముందే పిచ్‌పై పాకిస్థాన్ కొత్త డ్రామా, ఐసీసీ లక్ష్యంగా సక్లయిన్ విమర్శలు

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా భారత్‌తో తలపడేందుకు పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. అయితే ఈ కీలక పోరుకు ముందు ఆ దేశ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ పిచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కొత్త వివాదానికి తెరలేపారు. శ్రీలంకలోని పిచ్‌లను మార్చే అవకాశం ఉందని, ఐసీసీ ఎవరి ప్రభావంతో పనిచేస్తుందో అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయంటూ మ్యాచ్‌కు ముందే పాక్ ఆటగాళ్లు విమర్శలు గుప్పించడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఐసీసీని భారత్ శాసిస్తోందంటూ పాకిస్థాన్ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇప్పుడు సక్లయిన్ ముస్తాక్ చేసిన వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. మైదానంలో ఆట కంటే ముందే ఇలాంటి మానసిక యుద్ధానికి పాక్ సిద్ధమవ్వడం వారిలోని భయాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దాయాదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, పాకిస్థాన్ చేస్తున్న ఈ సరికొత్త ఫిర్యాదులు మ్యాచ్ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *