భారత్ కంటే 9 గంటల ముందే 2026లోకి అడుగుపెట్టిన దేశాలు ఇవే
December 31, 2025

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల కోసం ఎదురుచూస్తుండగా, భారత్ కంటే దాదాపు 9 గంటల ముందే పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవుల్లో 2026 నాంది పలికింది. కిరిబాటిలోని కిరితిమతి ద్వీపంలో అర్ధరాత్రి కావడంతో ప్రజలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. భౌగోళికంగా అంతర్జాతీయ దిన రేఖకు సమీపంలో ఉండటంతో ప్రతి ఏడాది ప్రపంచంలోనే అందరికంటే ముందుగా ఇక్కడ కొత్త ఏడాది మొదలవుతుంది.
కిరిబాటి తర్వాత న్యూజిలాండ్‌లోని చాథమ్ దీవుల్లో కూడా 2026 కొత్త ఏడాది ప్రవేశించింది. కేవలం 600 మంది జనాభా ఉన్న ఈ చిన్న ద్వీపంలో స్థానికులు ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. సముద్ర మట్టం పెరుగుతున్న కారణంగా కొన్ని భయాలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే మొట్టమొదటిగా కొత్త ఏడాదిని జరుపుకునే అరుదైన అవకాశం వీరికి దక్కింది.