భారత్ ఎకానమీ ఎత్తుకెక్కింది: 105% GDP వృద్ధితో ప్రపంచ రికార్డు!

భారత్ ఎకానమీ ఎత్తుకెక్కింది: 105% GDP వృద్ధితో ప్రపంచ రికార్డు!

భారతదేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన పురోగతి సాధించింది. గత పదేళ్లలో రెట్టింపు వృద్ధిరేటును నమోదు చేస్తూ, 2015లో $2.1 ట్రిలియన్‌ గల ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 105% వృద్ధితో $4.3 ట్రిలియన్‌కు చేరుకుంది. ఇది ప్రపంచంలో మరే దేశం సాధించని అపూర్వ ఘనతగా నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం, ఈ వృద్ధిరేటు కొనసాగితే 2025లో భారత్ జపాన్‌ను, 2027లో జర్మనీని అధిగమించే అవకాశముందని అంచనా.

మరోవైపు, చైనా 74% వృద్ధిరేటును నమోదు చేసుకుంటూ 2015లో $11.2 ట్రిలియన్‌ నుంచి 2025 నాటికి $19.5 ట్రిలియన్‌కు చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 28% వృద్ధితో $23.7 ట్రిలియన్‌ నుంచి $30.3 ట్రిలియన్‌కు పెరిగింది. కానీ భారతదేశం చూపించిన వేగం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మెరుగైన పెట్టుబడులు, స్థిరమైన పాలన, నిర్మాణాత్మక సంస్కరణలే ఈ అద్భుత విజయానికి కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *