భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు భయం; ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు

భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు భయం; ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు

ఆసియా కప్-2025 సూపర్‌ ఫోర్స్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్‌ జట్లు మరోసారి తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కి ముందు, పాకిస్తాన్ జట్టు తమ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేయడం చర్చనీయాంశమైంది. భారత జట్టుతో కరచాలనం చేసుకోకపోవడంపై ఐసీసీకి ఫిర్యాదు చేయడం, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌తో జరిగిన సమావేశానికి సంబంధించిన వీడియోను లీక్ చేయడంపై వచ్చిన విమర్శల నుంచి తప్పించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో కొత్త చర్చకు దారితీసింది. అంతేకాకుండా, జట్టు ఆటగాళ్లలో మనోధైర్యం పెంచడానికి ఒక మోటివేషనల్ స్పీకర్‌ను కూడా నియమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత జట్టు ఇప్పటికే ఒత్తిడిలో ఉంది, తాజా పరిణామం పాకిస్తాన్ ఆటగాళ్లలో భయాన్ని మరింత స్పష్టం చేస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *